![]() |
![]() |

'గుప్పెడంత మనసు' స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్. అత్యధిక వీక్షకులను ఆకర్షిస్తోన్న ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-661 లో.. వసుధార వాళ్ళింట్లో ఒంటరిగా కూర్చొని రిషీతో గడిపిన క్షణాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు ఏడుస్తూ ఉంటుంది. మరో వైపు వసుధారని తల్చుకుంటూ రిషి తన ఇంట్లో ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. వసుధార ఎందుకిలా చేసిందని పదే పదే అనుకుంటూ ఉంటాడు.
వసుధార వాళ్ళ అమ్మనాన్నలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నాన్న చక్రపాణికి అన్నం తినిపిస్తుండగా.. తను వసుధారని అన్న మాటలు గుర్తుచేసుకొని చక్రపాణి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. "ఎందుకు నాన్న ఏడుస్తున్నావ్?" అని వసుధార అడుగుతుంది. "నీ వ్యక్తిత్వాన్ని చూసి సిగ్గు పడుతున్నాను అమ్మా" అంటు చక్రపాణి బాధతో చెప్తాడు. "ఏడవకండి నాన్నా" అంటూ కన్నీళ్ళు తుడుస్తుంది వసుధార.
సూట్ కేస్ తీసుకొని రిషి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న దేవయాని, జగతి, మహేంద్ర చూస్తారు. రిషిని ఆపుతుంది దేవయాని. "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని అడుగుతుంది. "ఈ బంధం శాశ్వతం కానప్పుడు, తను నాతో లేనప్పుడు ఇంకెందుకని అందరికి దూరంగా వెళ్ళిపోతున్నాను" అని రిషి అంటాడు. "ఏదో జరిగిందని పరిస్థితులకు భయపడి పారిపోతున్నావా?" అని మహేంద్ర అడుగుతాడు. "పరిస్థితులకు భయపడేంత పిరికివాణ్ణి కాదు డాడీ. ఈ బాధ పోవాలంటే నన్ను నేను శిల్పిగా చెక్కుకోవాలి" అని రిషి అంటాడు. "నువు వెళ్తే కాలేజీని ఎవరు చూసుకుంటారు?" అని దేవయాని అడుగుతుంది. "కాలేజీ అన్ని బాధ్యతలు జగతి మేడం చూసుకుంటుంది. ఆల్రెడి మేడంకి మెయిల్ చేశాను" అని రిషి సమాధానమిస్తాడు. "మెయిల్ చేస్తే అయిపోతుందా.. మినిస్టర్ గారు ఒప్పుకుంటారా?" అని దేవయాని అడుగుతుంది. "మినిస్టర్ గారికి కూడా మెయిల్ చేశాను" అని రిషి అంటాడు. "ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా?" అని మహేంద్ర అడుగుతాడు. "అత్యంత అవసరం డాడీ" అని రిషి సమాధానమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |